సింగర్ సునీత, రామ్ ప్రీ వెడ్డింగ్ పార్టీ …!

 

 

 

టాలీవుడ్ గాయని సునీత పెళ్లి సమయం దగ్గర పడుతుంది. జనవరి 9న ఈ పెళ్లి జరగనుంది. ఇద్దరి జాతకాలు చూసిన తర్వాత 2020లో ముహూర్తం లేకపోవడంతో 10 రోజులు ఆలస్యంగా జరగనుంది వివాహ వేడుక. 42 ఏళ్ల వయసులో ఈమె మరోసారి పెళ్లి చేసుకోబోతుంది. బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనితో ఈమె ఏడడుగులు వేయబోతుంది. ఈ సందర్భంగా డిసెంబర్ 26 రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ హోటల్లో వీళ్ల ప్రీ వెడ్డింగ్ పార్టీ జరిగింది. పది రోజుల ముందే తమ వాళ్లకు పార్టీ ఇచ్చారు ఈ జంట. వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజుల కింద రామ్ తో సునీత నిశ్చితార్థం జరిగింది. అప్పుడు ఎలాంటి సందడి లేకుండానే ఈ వేడుక పూర్తి చేసారు కుటుంబ సభ్యులు.

ఇప్పుడు కూడా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని చూస్తుంది సునీత. మరోవైపు ఈ పెళ్లికి ఇండస్ట్రీ నుంచి కూడా ఎవర్నీ ఆహ్వానించడం లేదు. కేవలం ఇరు కుటుంబ వర్గాలు మాత్రమే రానున్నాయి. పైగా ఇది పెళ్లిలా భావించడం లేదని.. కేవలం రెండు కుటుంబాల కలయికలా తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది సునీత. అందులో పెళ్లి అనే మాట కంటే కూడా దైవత్వమే తనకు కనిపిస్తుందని చెప్పింది. ఇదిలా ఉంటే డిసెంబర్ 26 రాత్రి ఓ ప్రముఖ హోటల్లో సునీత, రామ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇండస్ట్రీలో ఉన్న పలువురు మిత్రులను ఈ వేడుకకు ఆహ్వానించింది సునీత. సురేష్ కొండేటి సహా మరికొందరు ఈ వేడుకకు వచ్చారు.

ఇదిలా ఉంటే డిసెంబర్ 19 రాత్రి కూడా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. అందులో సునీత బెస్ట్ ఫ్రెండ్స్ సుమ కనకాల, రేణు దేశాయ్ కూడా ఉన్నారు. ఆ ఇద్దరూ వచ్చి కాబోయే వధూవరులతో కాసేపు ముచ్చటించారు. అలాగే పార్టీ అంతా పాటలు, ఆటలతో సరదాగా సాగింది. వాళ్లతో పాటు పలువురు సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఈ వేడుకలో కనిపించారు. అది జరిగిన వారం రోజుల తర్వాత మరో పార్టీ కూడా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *