జోగిపేట్ శ్రీకాంత్ అనే ఖైదీగా కనిపిస్తున్నాడు నవీన్ పొలిశెట్టి. మీ ఖాకీబట్టలు, తుపాకీ గుండ్లు మా నోళ్లు నొక్కలేవు ఇన్ స్పెక్టర్ అంటూ నవీన్ పొలిశెట్టి చెబుతున్న డైలాగ్స్ ఫన్నీగా సాగుతున్నాయి. నవీన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్నాడు యువ నటుడు నవీన్ పొలిశెట్టి. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. తనదైన యాక్టింగ్ స్టైల్ తో అందరినీ అలరించే ఈ యువ హీరో ఇపుడు జాతి రత్నాలు సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.