పుట్టింటికి పంపలేదని పిల్లలతో సహా చెరువులో దూకి…

మనుషుల్లో ఓపిక రోజు రోజుకూ నశించిపోతోంది. కనీస సహనం లేకుండా… నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఫలితంగా క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. హైదరాబాద్‌ నగరంలో ఇలాంటి ఘటనే… ఓ మహిళ సహా రెండు పసి ప్రాణాలను బలితీసుకుంది.

సికింద్రాబాద్‌ పరిధిలోని జవహర్‌నగర్‌లో నివాసముండే నాగమణి అనే మహిళ… కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే… క్రిస్మస్ పండుగకు పుట్టింటికి వెళ్లడానికి ఆమె భర్త నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఆమె తన ఇద్దరు పిల్లలతో సహా చెన్నాపురం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నది. మృతిచెందిన చిన్నారుల్లో ఐదేండ్ల రూబీ, ఎనిమిది నెలల చిన్నారి ఉన్నారు. స్థానికులు సమాచారం అందిచడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *