బ్రిటన్ రిటర్న్స్‌ నుంచి ఆ రాష్ట్రంలో 12 మందికి కరోనా వ్యాప‌్తి…

కరోనా మహమ్మారి రెండోసారి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. బ్రిటన్‌లో కరోనా స్ట్రైన్ ను గుర్తించిన అనంతరం ప్రపంచదేశాలు అలెర్ట్ అయ్యాయి. కానీ అప్పటికే ఆ దేశం నుంచి ఇండియాకు వచ్చిన వారిలో పాజిటీవ్ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మొదటి దశ కరోనా కేసుల నమోదులో టాప్‌ ఫైవ్‌లో ఉన్న తమిళనాడు… కొత్త వైరస్‌తో వణికిపోతున్నది.

రాష్ట్రానికి ఇప్పటివరకు బ్రిటన్‌ నుంచి 1438 మంది వచ్చారు. అందులో 13 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కాగా, వారిని కలిసిన మరో 12 మందికి కూడా కరోనా సోకినట్లు తేలింది. దీంతో బ్రిటన్‌ నుంచి వచ్చినవారిని ఇంకెంత మంది కలిసారనే విషయం గురించి ప్రభుత్వం ఆరా తీస్తున్నది. వారిని గుర్తించడానికి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో బ్రిటన్‌ నుంచి వచ్చినవారిలో 13 మందికి పాజటివ్‌ వచ్చిందని, వారి ద్వారా మరో 12 మందికి కరోనా వైరస్‌ సోకిందని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సీ విజయభాస్కర్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *