టుడే కరోనా అప్డేట్….

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు.. రికవరీ రేటు కూడా గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 205 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం… గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 551 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,85,068కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,77,304 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 6,231 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో4,136 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. 1,533 మందిని మహమ్మారి బలితీసుకుంది.

ఇక దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,021 కేసులు నమోదవ్వగా… 21,131 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,02,07,871 కు చేరింది. తాజాగా 279 మంది మహమ్మారి బారినపడి మృత్యువాత పడ్డారు. కరోనాతో ఇప్పటి వరకు 1,47,901 మంది ప్రాణాలు కోల్పోగా 97,82,669 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. వివిధ ఆస్పత్రుల్లో 2,77,301 మంది చికిత్స పొందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *