కాంగ్రెస్‌ పార్టీలో చేరిన టీఆర్‌ఎస్ మున్సిపల్‌ చైర్మన్‌

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో వరుస ఓటములను ఎదుర్కొంటున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఊహించిన షాక్‌ ఎదురైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని ఆదిబట్ల మున్సిపల్‌ చైర్మన్‌ టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. గతకొంతగా ఆ పార్టీ నాయకత్వ తీరుతో​ తీవ్రంగా విభేదిస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌ ప్రవీణ్‌ గౌడ్‌ సోమవారం రాజీనామా సమర్పించారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా గుర్తింపు పొందిన ప్రవీణ్‌ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా  ఆ పార్టీ నేతలతో విభేదించిన తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *