ఏపీలో కొత్త కరోనా ఆనవాళ్ళు లేవు -వైద్యశాఖ

యూకే నుంచి ఆంధప్రదేశ్‌కు ఇప్పటి వరకు 1,363 మంది వచ్చారని రాష్ట్ర వైద్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ తెలిపారు. వారిలో 1,346 మందిని క్వారంటైన్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా 17 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. యూకే నుంచి వచ్చిన వారిలో 11 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని వెల్లడించారు. వారి కాంటాక్టు ద్వారా మరో 12 మందికి కరోనా వచ్చినట్లు వివరించారు. కరోనా బాధితుల నమూనాను పుణె వైరాలజీ, సీసీఎంబీకి పంపించామని, నివేదికలను రావాల్సి ఉందని చెప్పారు. ఇప్పటి వరకైతే రాష్ట్రంలో కరోనా కొత్త వైరస్‌ ఆనవాళ్లు బయటపడలేదని భాస్కర్‌ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *