అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ బృందంలో భారతీయుల లిస్టు పెరుగుతున్నది. శ్వేతసౌధానికి చెందిన డిజిటల్ స్ట్రాటజీ బృందంలో భారత్‌కు చెందిన యువతికి ఉన్నత పదవి దక్కింది. కశ్మీర్లో పుట్టిన అయేషా షాకు డిజిటల్ స్ట్రాటజీ బృందానికి పార్ట్నర్షిప్ మేనేజర్‌గా నియమితురాలైంది. డిజిటల్ స్ట్రాటజీ డైరక్టర్‌గా రాబ్ ఫహర్టీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. లూజియానాకు చెందిన అయేషా.. గతంలో బైడెన్-హారిస్ క్యాంపేన్ కోసం డిజిటల్ పార్ట్నర్షిప్ మేనేజర్‌గా చేశారు. ప్రస్తుతం ఆమె స్నిగ్‌సోనియర్ ఇన్స్టిట్యూట్కు అడ్వాన్స్మెంట్ స్పెషలిస్టుగా చేస్తున్నది. జాన్ ఎఫ్ కెన్నడీ సెంటర్లో ఆమె కార్పొరేట్ ఫండ్ అసిస్టెంట్ మేనేజర్‌గా కూడా చేసింది. బయో మార్కెటింగ్ సంస్థలోనూ ఆమె స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ స్పెషలిస్టుగా బాధ్యతలు నిర్వర్తించింది. భిన్న రంగాల్లో నిపుణులైన వారిని డిజిటిల్ స్ట్రాటజీ టీమ్‌లోకి తీసుకున్నారు. అమెరికా ప్రజలకు శ్వేతసౌధాన్ని దగ్గర తీసుకువెళ్లడమే వీరి కర్తవ్యం. తమ బృందంతో మళ్లీ అమెరికాకు పునర్ ఉత్తేజం తీసుకురానున్నట్లు ఇటీవల బైడెన్ అన్నారు.
జో-బైడెన్ బృందంలోకి మరో భారతీయ యువతి…

2020-12-29
Previous Post: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు….