ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మధ్య చర్చలు జరిపేలా ఆదేశాలు జారీ చేసింది. ప్రన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు నేటి నుంచి మూడు రోజుల లోపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ను కలవాని సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు జరపలేమన్న విషయాన్ని ప్రభుత్వం తరఫున అధికారులు నిమ్మగడ్డకు వివరించాలని ఆదేశించింది. ఈ భేటీ ఎక్కడ ఉంటుందనే విషయాన్ని నిమ్మగడ్డ తెలియజేస్తారని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య చర్చలు కొలిక్కి రాకపోతే మరోసారి వాదనలు వింటామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు….

2020-12-29
Previous Post: కడప జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య…
Next Post: జో-బైడెన్ బృందంలోకి మరో భారతీయ యువతి…