న్యూఇయర్ వేళ మందుబాబులకు ఝలక్…

హైదరాబాద్‌లో న్యూఇయర్‌ వేడుకలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న పోలీసులు… మందుబాబులకు మరో ఝలక్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే పదేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తాగి వాహనాలు నడిపేవారు టెర్రరిస్టుల కంటే డేంజర్‌ అన్న సైబరాబాద్‌ సీపీ సజ్జనార్… సోమవారం ఒక్కరోజే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 402 మంది పట్టుబడ్డారని వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారు ఎవరైనా సరే… కఠినంగా శిక్షింపబడతారని సజ్జనార్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *