మహబూబాబాద్ జిల్లాలోని చిన్న గూడూరు మండలం మoగోరి గూడెంలో విషాదం నెలకొంది. కూతురు పెళ్లి చేసిన గంటల్లోనే తండ్రి మృతి చెందాడు. ఈ ఘటన వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం మేరకు.. మoగోరి గూడెంకు చెందిన గూగులోతు నoదా, మాలిల చిన్న కుమార్తె వినోదను గూడూరు మండలం లయన్ తండాకు చెందిన జగన్‌కి ఇచ్చి సోమవారం తెల్లవారు జామున 4 గంటలకు వివాహం చేశారు. సోమవారం రాత్రి అబ్బాయి, అమ్మాయిని సాగనంపారు.
కాగా, ఇంటికి వచ్చిన నందు పడుకున్నాడు. రాత్రి 10 గంటల సమయంలో అన్నం తినేoదుకు భార్య లేపగా ఎంతకీ లేవలేదు. వెంటనే స్థానిక ఆర్ఎంపీ డాక్టన్ని పిలిచి చూపించగా అతను అప్పటికే మరణించాడని డాక్టర్ చెప్పారు. నoదుకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. చిన్న కూతురు పెండ్లి చేసి ఆనందంగా సాగనంపారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంతలోనే ఇలా జరిగిందని బోరున విలపించారు. విషయం తెలుసుకున్న నవ వధువు వినోద వచ్చి తండ్రి శవం పైన పడి విలపించితన తీరు పలువురుని కంటతడి పెట్టించింది.