పార్టీ పెట్టట్లేదని రజనీకాంత్ చేసిన ప్రకటనపై కమల్‌హాసన్ స్పందించారు. రజనీకాంత్ ప్రకటనతో ఎంతో నిరాశ చెందానని పేర్కొన్నారు. రజనీకాంత్ ఆరోగ్యం కూడా ముఖ్యమని చెప్పారు. ఎన్నికల ప్రచారం తర్వాత రజనీకాంత్‌ను కలుస్తానని వెల్లడించారు. అనారోగ్య కారణాల దృష్ట్యా పార్టీ పెట్టట్లేదని తలైవా నేడు స్పష్టం చేశారు. అయితే రాజకీయాలతో సంబంధం లేకుండా తన ప్రజాసేవ కొనసాగుతుందని వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా అభిమానులకు మూడు పేజీల లేఖ విడుదల చేశారు.
రజనీకాంత్ ప్రకటనతో నిరాశ చెందా -కమల్‌హాసన్

2020-12-29
Previous Post: ప్రయాణికుల వాహనాలకు ఎయిర్ బ్యాగ్‌లు తప్పనిసరి…
Next Post: ఆసీస్‌కు మరో ఎదురుదెబ్బ…