పవన్‌ వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని ఘాటు విమర్శలు…

పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. శతకోటి లింగాల్లో నాని బోడిలింగం అన్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. పవన్ సినిమాల్లో యాక్టింగ్ చేసుకోక ఇలాంటి పనికిమాలిన మాటలేంటని ప్రశ్నించారు. రాజకీయ వేశ్యలా రెండు చోట్ల తాను మాట్లాడలేనని విమర్శించారు. బోడిలింగం ఎవరనేది గత ఎన్నికల్లో తేలిపోయిందని… బోడిలింగం ఎవరో గాజువాక ప్రజలకు బాగా తెలుసునన్నారు. అందుకే గత ఎన్నికల్లో రెండు చోట్ల కిందపడేశారని ఘాటు విమర్శలు చేశారు. తాను గుడివాడలో క్లబ్బులు మూయించింది… ఆడిస్తున్నది ప్రజలుకు తెలుసునన్నారు మంత్రి. ఎవరో వచ్చి ఏదేదో అడిగితే సమాధానం చెప్పనని స్పష్టం చేశారు.

ఇక… పవన్‌ను సినిమాలు చేసుకోవద్దని ఎవరూ చెప్పలేదన్నారు మంత్రి కొడాలి నాని. ఆయనను ఎవరైనా సినిమాలు మానేయాలని అడిగారా..? అని ప్రశ్నించారు. పవన్ సినిమాలు చేస్తే ఏంటి.? చేయకపోతే ఏంటి..? అని వ్యాఖ్యానించారు. పవన్ నువ్వు ఒక యాక్టర్‌వి మాత్రమే… సినిమాల్లో మాత్రమే నీ యాక్షన్ చూపించాలని చురకలంటించారు.
ఇక… అసెంబ్లీ ముట్టడి వ్యాఖ్యలపై మండిపడ్డ నాని… చేతనైంది చేసుకోవాలని కౌంటరిచ్చారు. పవన్‌ కళ్యాణ్‌కు జగన్ మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చే స్థాయి లేదని… వీళ్లంతా జగన్ కాలిగోటికి కూడా సరిపోరన్నారు. తాను ఎవరి దగ్గర ప్యాకేజీలు తీసుకుని నోటికొచ్చింది మాట్లాడడని… నోరు అదుపులో పెట్టుకోమని మాకు చెప్తున్న పవన్, ముందు తాను నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. జగన్‌కు ఈ వకీల్‌ సాబ్ చెప్తున్నాడంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నాని… నిన్ను ప్రజలు `షకీలా సాబ్` అని అంటున్నారని ఘాటుగా విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *