రాజకీయ పార్టీపై వెనక్కి తగ్గిన రజనీకాంత్.. కారణం ఇదే

రజనీకాంత్ అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈ నెల చివరన రాజకీయ పార్టీ ప్రకటిస్తానని చెప్పిన రజనీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయపార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు పేర్కొంటూ మూడు పేజీల లేఖను విడుదల చేశారు. రాజకీయ పార్టీ నడిపేందుకు తన ఆరోగ్యం సహకరించడం లేదని రజనీకాంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు క్షమాపణలు చెప్పారు తలైవా. రాజకీయాల్లోకి రాకుండానే ప్రజలకు సేవ చేస్తానని రజనీకాంత్ లేఖలో స్పష్టం చేశారు. అయితే.. ఇటీవలే హైదరాబాద్‌ షూటింగ్ సందర్భంగా రజనీకాంత్ అస్వస్తతకు గురైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *