భారత్‌లో ఆరుగురికి కరోనా స్ట్రెయిన్ గుర్తింపు…

భారత్‌లో కొత్త రకం వైరస్‌ స్ట్రెయిన్‌ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. భారత్‌లో ఆరుగురికి కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ నిర్ధరణ అయ్యింది. యూకే నుంచి వచ్చిన ఆరుగురిలో కొత్తగా మార్పు చెందిన వైరస్‌ను అధికారులు‌ గుర్తించారు. బెంగళూరులో ముగ్గురికి, హైదరాబాద్‌లో ఇద్దరికి, పుణెలో ఒకరికి కొత్తరకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ నిర్ధరణ అయినట్లు మంగళవారం కేంద్ర హోంశాఖ అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఆరుగురిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *