కరోనాతో జీహెచ్ఎంసీ కొత్త కార్పొరేటర్ మృతి…

జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా గెలిచిన కార్పొరేటర్ కరోనా కాటుకు బలయ్యాడు. లింగోజీగూడ డివిజన్‌ బీజేపీ కార్పొరేటర్‌ రమేశ్‌ గౌడ్‌… కొన్ని రోజుల కరోనాతో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. ఇటీవలే జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన రమేశ్‌ గౌడ్‌… లింగోజీగూడ నుంచి కార్పొరేట్‌ర్‌గా ఎన్నికయ్యారు. కాగా, వారం రోజుల క్రితం రమేశ్‌ గౌడ్‌కు కరోనా సోకగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కానీ వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో రమేశ్‌ గౌడ్‌ ప్రాణాలు కోల్పోయారు. గతంలో రమేశ్‌ గౌడ్‌ ఎల్బీ నగర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌గా పనిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *