రోజు రోజుకూ అడవులు అంతరించిపోతుండడంతో వన్యప్రాణులు జనావాసలపై పడుతున్నాయి. అడవుల్లో తినేందుకు ఏమీ దొరకపోవడంతో వానరదండు పల్లెలలు, పట్టణాలపై దండయాత్ర చేస్తున్నాయి. పల్లెల్లో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న వానరదండు.. హైదరబాద్ నగరంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ల పట్టణంలోని కూకట్పల్లి జయనగర్‌లో కోతుల బెడత ఎక్కువైంది. అక్కడే నివాసముండే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి… వర్క్ ఫ్రం హోంలో భాగంగా ఇంట్లో నుంచే విధులు నిర్వహిస్తున్నాడు. తాను పనిచేసుకుంటున్న సమయంలో… ఇంటి ఆవరణంలోకి వచ్చిన కోతులను అదిలించబోయి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు.
అయితే, మంగళవారం మధ్యాహ్నం రెండో ఫ్లోర్లో ఉన్న తన ఇంట్లోకి కోతులు రావడంతో వాటిని బెదరగొట్టేందుకు ఇనుపరాడ్‌తో కొట్టబోయాడు. దీంతో ఇనుపరాడ్ ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లకు తగలడంతో షాక్‌కు గురయ్యాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి చేరుకునేలోపే లోకేష్ ప్రాణాలు వదిలాడు. దీంతో కుటుంబంలో, కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.