ఓకే కుటుంబంలో 22 మందికి కరోనా… తెలంగాణలో

సూర్యాపేట జిల్లాలో మరోసారి కరోనా విజృంభించింది. సేకండ్ వేవ్‌కు తెలంగాణలో అవకాశం లేదని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ… కొన్ని ప్రాంతాల్లో కేసులు బయట పడుతున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లాలో ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా సోకడం కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు డీఎంహెచ్‌వో వెల్లడించారు. ఇటీవల కుటుంబంలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు వెళ్లివచ్చారు. ఆ తర్వాత ఆ వ్యక్తికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ రావడంలో కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించారు. వారందరికి కూడా కరోనా పాజిటివ్‌ అని తేలింది. బాధితుల్లో కరోనా లక్షణాలు లేనప్పటికీ కరోనా నిర్థరణ అయినట్లు డీఎంహెచ్‌వో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *