వ్యాక్సిన్‌ డ్రై రన్‌పై అనేక అనుమానాలు..!


వ్యాక్సిన్‌ డ్రై రన్‌పై అనేక అనుమానాలు..!

దేశ వ్యాప్తంగా రేపటి నుంచి కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్ ప్రారంభం కానుంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎంపిక చేసిన జిల్లాలలో వ్యాక్సిన్‌ పంపిణీ చేయనుంది కేంద్రం. ఈ డ్రైవ్ కోసం ఆరోగ్యశాఖ అధికారుల ఇప్పటికే వ్యాక్సిన్‌ నిల్వ చేయడానికి అన్ని రకాల తాత్కాలిక ఏర్సాట్లు చేశారు.. దాదాపు 80 కోట్ల సిరంజిలకు కేంద్రం ఆర్డర్ చేసింది. కరోనా వైరస్‌తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది గుడ్ న్యూసే.. కరోనా వల్ల జరిగినష్టం నుంచి బయటపడటానికి వ్యాక్సిన్‌ కొంత వరకూ దోహాద పడుతుంది. దేశ వృద్దిరేటు పుంజుకుంటుందని నిపుణులు అంఛనాలు వేస్తున్నారు.

అయితే వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ అనేక మంది నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా వారియర్స్‌కు ముందుగా వ్యాక్సిన్‌ ఇస్తామని తొలుత చెప్పిన కేంద్రం… ఇప్పుడు అందరికీ ఇస్తామడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. వ్యాక్సిన్‌లు కరోనా వైరస్‌పై పని చేస్తుందా? లేదా? ప్రజలపై వ్యాక్సిన్‌ ప్రయోగాలు చేస్తున్నారా..?. ఒకేసారి భారీ స్థాయిలో వ్యాక్సినేషన్‌ వల్ల వచ్చే సైడ్‌ ఎఫెక్ట్ లను తట్టుకునే సామార్ధ్యం మనకు ఉందా.. అనేది బిలియన్ డాలర్ల ప్రశ్మ. ఇప్పటికే గతంలో నాలుగు రాష్ట్రాల్లో డ్రైవ్ చేపట్టారు. వాటి వివరాలు ఇంత వరకూ అరోగ్యశాఖ బహిర్గతం చేయలేదు.

కరోనా వ్యాక్సిన్‌ నిల్వచేయడానికి తగిన కొల్డ్ స్టోరేజీలు పూర్ది స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఇక వేల కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్‌ భారత్‌కు తీసుకువస్తే వాటిని స్టోరేజీ చేయడానికి అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. తగిన స్థాయిలో స్టోరేజ్‌ చేయకపోతే వాక్సిన్‌ వల్ల లాభాల కంటే చెడు ప్రమాదాలే ఎక్కవగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కరోనా వైరస్‌ వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకోవాలి..? ఏడాదిలో ఎన్నిసార్లు వేసుకోవాలి? పోలియో వ్యాక్సిన్ లాగా ఒక సారి వేసుకుంటే సరిపోతుందా? అంటే ఔషధ కంపెనీలు, ప్రభుత్వాల వద్ద సరైన సమాచారం లేదు. కరోనా వ్యాక్సిన్ చాలా ధరలతో కూడుకుంది. ప్రజల ఆరోగ్యం ముందు డబ్బు ప్రధానం కాదు కాని ప్రభుత్వాలు ఎప్పటికీ ఉచిత వ్యాక్సిన్‌ ఇసుందా..? గతంలో భారత్ వంటి దేశాలు కరోనా వ్యాక్సిన్‌ పొందాలంటే దాదాపు రూ .80వేల కోట్లు అవసరం అవుతాయని అమెరికాకు చెందిన కంపెననీ ప్రకటించింది. ప్రతీ ఏడాది ఇంత మొత్తంలో ప్రభుత్వాలు ఖర్చు చేయగలవా? ప్రతి సారి ఉచితంగా ఇవ్వగలవా?. ఒకవేళ ప్రభుత్వం ఒక సారి వ్యాక్సినేషన్ చేసి వదిలేస్తే… ఆ భారం ప్రజలపై పడే ప్రమాదం ఉంది.

కరోనా వల్ల ఉపాధి కోల్పోయి రోజు రోజుకు జీవన ప్రమాణాలు తగ్గుతున్న సమయంలో ప్రజలు వ్యాక్సిన్‌ భారం మోయగలరా..?.

ఇకపోతే, కరోనా వ్యాక్సిన్‌ ఒక సారి వేసుకుంటే దాని ప్రభావం ఆరు నెలల వరకే ఉంటుందిన అనేక అంతర్జాతీయ వ్యాక్సిన్ నిపుణులు చెపుతున్నారు. ప్రతి ఆరు నెలలకొకసారి వ్యాక్సిన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు వైద్యంపై పెట్టే ఖర్చును రోజు రోజుకు తగ్గిస్తూనే ఉంది. ప్రైవేట్ ఆస్పత్రులు, ఔషధ కంపెనీలు సిండికేట్ గా ఏర్పడి ధరలు పెంచితే… భారం పడేది సామాన్యుడి మీదే. అప్పుడు ప్రజలు ఆరోగ్యంపై మరింత ఖర్చు చేయవలసి ఉంటుంది. ఫలితంగా పెదరికం మరింత పెరిగిపోతుంది. గ్రామీణ ప్రాతంలో ప్రజల జీవన పరిస్థితి మరింత అడుగునకు దిగజారుతుంది. ఇప్పటికే సమస్యగా మారుతున్న నిరుద్యోగం, నిరాశ పెరుగుతుంది. వచ్చిన రోగం ఏదో తెలియక, వ్యాక్సిన్ వేసుకోవడానికి ప్రజలు ఆందోళ చెందుతారు.

ప్రభుత్వాలు కరోనా వ్యాక్సిన్‌ అందరికి ఉచితంగా ఇవ్వడం కాదు.. ప్రతిసారి అందరికి ఉచిత వ్యాక్సిన్‌ ఇవ్వడం వల్ల దేశ బడ్జెట్‌లో అధిక భాగం వాక్సిన్‌ కొరకే ఖర్చు చేయవలసి వస్తుంది. అలాగని.. పేదవారికి, వ్యాక్సిన్‌ కొనే సామార్థ్యం ఉన్న వారికి అందరికీ ఉచితం వ్యాక్సిన్‌ ఇవ్వడం సరైంది కాదు. దాని కోసం ప్రభుత్వాలు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయాలి.

ఆర్థికంగా వెనుకబడిన వారికి, వ్యాక్సిన్‌ కొనలేని వారికి మాత్రమే ఉచితంగా ఇస్తే ప్రభుత్వంపై భారం పడకపోక నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేసినట్లు అవుతుంది. అలా కాకుండా అందరికి గుంప గుత్తగా వ్యాక్సిన్ ఇస్తే… తాత్కాలికంగా ప్రయోజనం ఉన్నప్పటికినీ భారం పెరిగిందనే నేపంతో భవిష్యత్‌లో ఉచిత వ్యాక్సిన్ నుంచి ప్రభుత్వం తప్పుకోనే ప్రమాదం ఉంది. అప్పుడు పేదలపై కరోనా మరింత ప్రతాపం చూపిస్తుంది.

రమేష్ తోటకూర, సీనియర్ జర్నలిస్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *