ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్…
కేంద్ర బడ్జెట్‌కు ముహుర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. జనవరి 29వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండా… ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వర్గాల ద్వారా తెలుస్తోంది. వాస్తవానికి గతేడాది కరోనా వైరస్ వల్ల వర్షకాల సమావేశాలను అర్థాంతరంగా ముగించడంతో పాటు… శీతాకాల సమావేశాలను రద్దు చేశారు. కాగా… జనవరి 29న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా… ఆ రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం చేయనున్నారు.