పవన్‌తో సినిమా తప్పకుండా ఉంటుంది :యంగ్ డైరెక్టర్

పవన్‌తో సినిమా తప్పకుండా ఉంటుంది :యంగ్ డైరెక్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో టాప్‌ ఫ్యాన్స్‌ ఉన్న హీరోల్లో పవన్ ముందుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. వివిధ రాష్ట్రాల్లోనూ వపన్‌కు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. అలాంటి టాప్‌ హీరో సినిమా చేసందుకే ఏ డైరెక్టర్‌ అయినా సిద్ధంగా ఉంటాడు. అటు.. సాధారణంగా పవన్ స్ట్రాటజీ కూడా డిఫరెంట్‌. ఏ హీరో అయినా టాప్ దర్శకులతో సినిమా చేయాలని కోరుకుంటే.. పవన్ మాత్రమే అప్పుడప్పుడే సక్సెస్ అందుకుంటున్న చిన్న దర్శకులతో చేసేందుకు ఇష్టపడతాడు. తనకు స్టోరీ కనెక్ట్ అయితే… సింగిల్ సిట్టింగ్‌లోనే మూవీ ఒప్పుకుంటాడని టాక్ కూడా ఉంది. అదే తరహాలో ఒకప్పుడు కందిరీగ దర్శకుడు కూడా బాగా కనెక్ట్ అయ్యాడు.

మొదటి సినిమాతోనే.. రామ్ పోతినేనితో కందిరీగ సినిమాను డైరెక్ట్ చేసిన సంతోష్ శ్రీనివాస్ మంచి బాక్సాఫీస్ హిట్ అందుకొని మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ తనవైపు తిరిగేలా చేసుకున్నాడు. అయితే ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో రభస అనే సినిమా చేసిన ఈ దర్శకుడు ఊహించని డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. అనంతరం మళ్ళీ రామ్ తో హైపర్ సినిమా చేసి కాస్త పరవాలేదు అనిపించాడు.

ఈ దర్శకుడు మొదట సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసి ఆ తరువాత దర్శకుడిగా మారాడు. అయితే ఈ సారి ఎలాగైనా అల్లుడు అదుర్స్ సినిమాతో బాక్సాఫిస్ హిట్ అందుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సంతోష్ ఈ సినిమా రిజల్ట్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు చెప్పాడు. తప్పకుండా సినిమాక్ అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుందని అన్నాడు.

అయితే ఈ దర్శకుడు కొన్నేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఖుషి నిర్మాత ప్రొడక్షన్ లోనే వీరి కాంబో కలిసే ఛాన్స్ ఉన్నట్లు అప్పట్లో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. కానీ స్క్రిప్ట్ అంతగా నచ్చలేదని నిర్మాతనే ఆ కాంబినేషన్ ను క్యాన్సిల్ చేసినట్లుగా కూడా మరికొన్ని రూమర్స్ వచ్చాయి.

పవర్ స్టార్ తో ఒక సినిమా.. తప్పకుండా… ఆ తరువాత పవన్ క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల అల్లుడు అదుర్స్ సినిమా కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో సంతోష్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ సినిమాపై ఒక క్లారిటీ ఇచ్చాడు. తప్పకుండా ఆయనతో ఒక సినిమా ఉంటుందని అంటూ అందులో ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. అలాగే రామ్ కందిరీగ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *