తొలి టీకా వేయించుకోనున్న మంత్రి ఈటల…?

తొలి టీకా వేయించుకోనున్న మంత్రి ఈటల…?

హైదరాబాద్‌ త్వరలో కరోనా టీకా వేసే ప్రక్రియ తెలంగాణలో ప్రారంభం కానుంది. దీని కోసం ఇప్పటికే డ్రై రన్ నిర్వహించగా, ఈ వారంలో మరోసారి డ్రైరన్ చేపట్టనున్నారు. మన దేశంలో తయారైన కోవీషీల్డ్, కొవాగ్జిన్‌ల వినియోగానికి ఇప్పటికే అనుమతి లభించింది. దీంతో ఈ నెల మూడో వారం నుంచి తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి టీకాను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తీసుకోనున్నట్టు సమాచారం. ప్రజలకు వ్యాక్సిన్‌ పట్ల భరోసా కల్పించేందుకే మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, వ్యాక్సిన్ ముందుగా ఫ్రంట్‌ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య సిబ్బంది, కార్మికులు, పారా మెడిక‌ల్ స్టాప్‌తో పాటు పోలీస్ సిబ్బందికి వేయ‌నున్నారు. ఇక సామాన్య ప్రజలకు టీకా తీసుకోవాలంటే కొవిన్ – CoWIN పోర్టల్లో గానీ, యాప్‌లో గానీ త‌మ పేర్లను న‌మోదు చేయించుకోవాలి. న‌మోదు చేయించుకున్న వారికి వ్యాక్సిన్ వేసే తేదీల‌ను నిర్ణయించి.. వారికి స‌మాచారం తెలియ‌జేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *