`రెనో 5 ప్రొ` రిలీజ్‌ డేట్ ఫిక్స్‌ చేసిన ఒప్పో…

`రెనో 5 ప్రొ` రిలీజ్‌ డేట్ ఫిక్స్‌ చేసిన ఒప్పో…

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో మరో అద్భుత స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేయడానికి సిద్ధమైంది. జనవరి 18న మధ్యాహ్నం 12:30 గంటలకు `రెనో 5 ప్రొ` 5G ఫోన్‌ను విడుదల చేస్తామని ఒప్పో మంగళవారం ధ్రువీకరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ చిప్‌సెట్‌తో దేశంలో విడుదలకాబోతున్న మొదటి ఫోన్‌ ఇదే కావడం విశేషం. చైనాలో ఈ ఫోన్‌ను గత డిసెంబర్‌లోనే విడుదల చేశారు. అక్కడ 8GB + 128GB వేరియంట్ ధర రూ .38,200 కాగా… 12GB + 256GB వేరియంట్‌ ధర రూ. 42,700గా నిర్ణయించారు. ఒప్పో ఫోన్ అరోరా బ్లూ, మూన్‌లైట్‌ నైట్, స్టార్రి నైట్ కలర్లలో అందుబాటులో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *