సెంట్రల్ విస్టాకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్…

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త పార్లమెంట్ భవనం, కేంద్ర ప్రభుత్వ భవన నిర్మాణం కోసం చేపడుతున్న ఈ ప్రాజెక్టు కోసం తెచ్చిన అనుమతులు సక్రమంగానే ఉన్నట్లు అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ప్రాజెక్టును ఆపేందుకు చట్టబద్దంగా ఎలాంటి అడ్డంకులు లేవని కోర్టు పేర్కొంది. పర్యావరణ అనుమతులపై కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన క్లియరెన్స్‌ స్పష్టంగా ఉన్నట్టు కోర్టు తెలిపింది. సెంట్రల్ విస్టా పనులపై నమోదు అయిన కేసులో ఈమేరకు త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనంలో 2-1తో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జ‌స్టిస్ ఏఎం ఖాన్‌విల్క‌ర్‌, దినేశ్ మ‌హేశ్వ‌రి, సంజీవ్ ఖన్నాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తీర్పును వెలువ‌రించింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం భూ వినియోగంపై మాత్రం జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా.. ప్రభుత్వంతో వ్యతిరేకించారు.

కాగా… ప్రధాని నరేంద్రమోదీ ఈ మధ్యే సెంట్రల్ విస్టా ప్రజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ భ‌న‌వ నిర్మాణం కోసం స్థలం మార్చడాన్ని, ఇచ్చిన అనుమతులను తప్పుబడుతూ పిటీషనర్లు కోర్టును ఆశ్రయించారు. అధికారుల నిర్ణయాన్ని ప్రశ్నించారు. అయితే, ఈ ప్రాజెక్టుపై ఉన్న కేసులో తీర్పు వచ్చేవరకు పనులు చేపట్టబోమని కేంద్రం పేర్కొంది. తాజాగా సుప్రీం కోర్టు తీర్పుతో సెంట్రల్ విస్టా పనులు ప్రారంభం కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *