రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సికింద్రాబాద్‌లోని మహిళా కమిషన్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10.30గంటలకు ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు. కమిషన్ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి, సభ్యులుగా రేవతిరావు, కుమ్ర ఈశ్వరీబాయి, షహీనా అఫ్రోజ్, గద్దల పద్మ, సూదం లక్ష్మి, కొమ్ము ఉమాదేవి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళల హక్కుల రక్షణ కోసం మహిళా కమిషన్ పనిచేయలని సూచించారు.