అమెజాన్ ప్రైమ్‌లోకి జాతిరత్నాలు… ఎప్పుడంటే?

ఈ మధ్య కాలంలో ప్రేక్షకుడిని బాగా నవ్వించిన సినిమా జాతి రత్నాలు. కథ కన్నా కామెడీ మీద దృష్టిపెట్టిన డైరెక్టర్‌ అనుదీప్‌ ప్రజలను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడంలో సక్సెస్‌ సాధించాడు. మార్చి 11న రిలీజైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ మంచి విజయం సాధించింది.

ప్రధాన తారాగణం నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లాకు మంచి అవకాశాలను సైతం తెచ్చిపెట్టింది. ఇక కరోనా భయంతో థియేటర్‌కు వెళ్లలేని ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ కోసం తహతహలాడిపోతున్నారు. తాజాగా వారికి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో శుభవార్త చెప్పింది. జాతిరత్నాలు సినిమా ఏప్రిల్‌ 11 నుంచి ప్రసారం కానున్నట్లు వెల్లడించింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ఈ సినిమా హిందీ, కన్నడ డబ్బింగ్‌ కావాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *