హ్యాట్సప్‌: యజమానిపై పులిదాడి.. చాకచక్యంగా కాపాడిన గేదెలు..!

ఓ పశువుల కాపరిపై పులి దాడికి యత్నించగా… అతను పెంచుతున్న గేదెలే కాపాడాయి. మధ్యప్రదేశ్ ఉమారియాలోని ప్రఖ్యాత బాంధవ్‌గఢ్​ టైగర్ రిజర్వ్‌లో జరిగిందీ ఘటన. బాంధవ్‌గఢ్ పులుల సంరక్షణా కేంద్రానికి సమీపంలో నివసించే లల్లూ యాదవ్ అనే పాల వ్యాపారి ఎప్పటిలాగే.. ఏప్రిల్ 5న తన గేదెలను తీసుకుని అడవికి వెళ్లాడు. సాయంత్రం సమయంలో అలసిపోయిన అతను.. సమీప చెరువులో నీరు తాగేందుకు ఆగాడు. అకస్మాత్తుగా ఒక పులి అతనిపైకి దూకింది. తన పంజాలతో బుగ్గలు, భుజాలను గాయపరిచింది. దీంతో అతను నేలమీద పడిపోయి.. నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయాడు.

నేలమీద వెల్లకిలా పడిపోయిన తన​కు పెద్దపులి గర్జన భయంకరంగా వినిపించిందని.. కానీ లేచి చూసేసరికి విస్తుపోయే దృశ్యాలు తన కంట పడ్డాయని లల్లూ యాదవ్ వివరించాడు. గేదెలన్నీ పులి చుట్టూ చేరి తనపై దాడి చేయకుండా పెద్ద శబ్దాలు చేశాయని తెలిపాడు. ఈ ఆరు గేదెల నడుమ పెద్దపులి తనను ఏమీ చేయకుండా ఉండిపోయిందన్నాడు. దాదాపు 10 నిమిషాల తరువాత పులి పారిపోయిందని అడవిలో జరిగిన సంఘటన గురించి వివరించాడు లల్లూ యాదవ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *