కోబ్రా జవాను రాకేశ్వర్ సింగ్ విడుదల
ఐదురోజులుగా మావోయిస్టుల దగ్గర బందీగా ఉన్న కోబ్రా జవాను రాకేశ్వర్ సింగ్ మన్హాస్ ఎట్టకేలకు విడుదలయ్యాడు. తొలుత మధ్యాహ్నం 3.45 గంటల ప్రాంతంలో జవానును విడుదల చేస్తామని మావోయిస్టులు సమాచారమిచ్చారు. దీంతో జవాను కోసం ఓ మాజీ నక్సలైట్ అడవిలోకి వెళ్లి తిరిగి వచ్చారు. తాజాగా జవానును మావోలు విడుదలచేశారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో ఈ నెల 3న జరిగిన భీకర ఎన్కౌంటర్ తర్వాత కోబ్రా జవాను రాకేశ్ మావోల చేతికి చిక్కిన సంగతి తెలిసిందే.